స్తీ, పురుషులను సమానంగా చూడాలి

ప్రజాశక్తి – మండవల్లి

స్త్రీ, పురుషులు వేరు వేరు కాదని, సమాజంలో ఇద్దరి విలువ ఒక్కటేనని ప్రతిఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎపిఎం రాజశ్రీ తెలిపారు. జెండర్‌ ఆధారిత హింసకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యక్రమాన్ని స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 22 వరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా స్త్రీ, పురుషులు ఇరువురు ఒక్కటేనన్నారు. స్త్రీలకు మగవారితో పాటు సమాన హక్కులు ఉన్నాయని, ప్రతిఒక్కరు తెలుసుకోవాలన్నారు. అనంతరం సమాన ఆస్తి హక్కు కల్పిస్తామని, మగవారితో సమానంగా చూస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వెంకటరమణ, తహశీల్దార్‌ రాజ్‌ కుమార్‌, ఇఒపిఆర్‌డి ఆనంద్‌ బాబు, హౌసింగ్‌ ఎఇ వివిఎస్‌ శేఖర్‌ పాల్గొన్నారు.

➡️