స్పందనలో సమస్యలకు పరిష్కారం

స్పందన

ప్రజాశక్తి-అమలాపురంఎంతోవ్యయ ప్రయాసల కోర్చి జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమాలు విచ్చేసే అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సంతప్తికర స్థాయిలో అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌ నుంచి జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌.సత్తి బాబులు అర్జీదారుల నుంచి సుమారు 41 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి తగు పరిష్కార మార్గాలు అర్జీదారుడు సంతప్తి చెందే స్థాయిలో చూపాలని ఆదేశించారు. గడువు దాటిన అర్జీలు లేకుండా ఒకసారి సమర్పించిన అర్జీ మరలా అదే అంశంపై పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి అర్జీపై సకాలంలో పరిష్కార మార్గాలు చూపుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహణ తీరు పట్ల అర్జీదారుల్లో విశ్వసనీయతను పెంపొందించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

➡️