స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

Mar 26,2024 19:35
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న దృశ్యం
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ప్రజాశక్తి-వలేటివారిపాలెం :ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని ఎస్‌ఐ బాల మహేందర్‌ నాయక్‌ సూచించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం మండలంలోని పరిసర ప్రాంతాల్లో పోలీస్‌ సాయుధ బలగాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. ఎస్‌ఐ బాల మహేందర్‌ నాయక్‌ మాట్లాడుతూ రాబోవు ఎన్ని కల్లో ప్రతి ఓటరూ తమ ఓటుని సద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తాము అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్నామని తె లిపారు. ఓటర్లు ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గ దర్శకాలను తప్ప కుండ పాటించాలని సూచించారు. పోలింగ్‌ సమయంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️