హెక్టారుకు రూ.30 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి

ఉప్పలగుప్తంలో తడిచిన పనులను పరిశీలిస్తున్న టిడిపి బృందం

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హెక్టారుకు రూ.30 వేలు ఇన్‌ పుట్‌ సబ్సిడీ అందించి ఆదుకోవాలని టిడిపి రైతు కమిటీ బందం డిమాండ్‌ చేసింది.మురళీ కష్ణంరాజు, భీమ్‌ శంకర్‌, సత్తిబాబు, మట్ట మహాలక్ష్మి ప్రభాకర్‌, స్వామి నాయుడులతో ఐదుగురు సభ్యుల టిడిపి రైతు కమిటీ బందం అమలాపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ ఛార్జ్‌ అయితాబత్తుల ఆనందరావు, ాయకులతో కలిసి పెదగాడవిల్లి, ఉప్పలగుప్తం తదితర గ్రామాల్లో పర్యటించి తుపానుకు దెబ్బతిన్న వరిచేలను పరిశీలించారు .పంట నష్టాలపై రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలాపురం నియోజకవర్గంలో మొత్తం 13 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా సుమారు 6,500 ఎకరాల్లో వరిచేలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులకు బీమా వంద శాతం అమలు చేసి రైతు కోరుకున్న విత్తనాలు వంద శాతం సబ్సిడీపై అందించాలని డిమాండ్‌ చేశారు.పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వాతావరణ శాఖ ముందుగానే తుపాను ముప్పు ఉందని తెలిపినప్పటికీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో ఇటువంటి ప్రకతి విపత్తులు జరిగిన వెంటనే చంద్రబాబే స్వయంగా వచ్చి దగ్గరుండి పర్యవేక్షించడమే కాకుండా భవిష్యత్తు కార్యాచరణ కోసం అక్కడి నుండే ప్రణాళికలు రూపొందించి రైతులను ఆదుకునేవారని గుర్తు చేశారు. బందం వెంట టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, టిడిపి మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ, తెలుగు రైతు మండల అధ్యక్షుడు పెమ్మిరెడ్డి సత్యనారాయణ, వేగిరాజు వెంకటరాజు, అల్లాడ సోంబాబు, మంచెం బాబి, అకేటి పెద్ద, సత్తిబాబు,చీకట్ల ఏసుబాబు, కన్నీడి రమేష్‌ తదితరులు ఉన్నారు.

 

 

➡️