హోరాహోరీగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అండర్‌-14 బాలికల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఇన్ఫాంట్‌ జీసస్‌ హైస్కూల్‌లో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మూడవ రోజు పోటీలలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ జట్ల మధ్య పోటీలు ప్రారం భమయ్యాయి. ఈ ప్రారంభ మ్యాచ్లో ఛత్తీస్‌గఢ్‌ 26 పాయింట్ల తేడాతో గెలుపొం దింది. కోర్టు నెంబర్‌ రెండులో తమిళనాడు, తెలంగాణ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విచిత్రమైన మలుపుల మధ్యన చివరికి ఇద్దరికీ 56 పాయింట్లు రావ డంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. గోవా, విద్యా భారతి జట్ల మధ్య జరిగిన పోటీలో 33 పాయింట్లు తేడాతో విద్యా భారతి జట్టు గెలుపొందింది. చండీగఢ్‌, హిమాచ ల్‌ప్రదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 69 పాయింటులతో హిమాచల్‌ప్రదేశ్‌ విజయం సాధించింది. కర్ణాటక, రాజస్థాన్‌ల మధ్య జరిగిన పోటీలో 13 పాయింట్లు తేడాతో రాజస్థాన్‌ గెలుపొందింది. ఎన్‌విఎస్‌, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన పోటీల్లో 35 పాయింట్లు తేడాతో మహారాష్ట్ర గెలుపొందింది. గుజరాత్‌, మధ్యప్ర దేశ్‌ మధ్య జరిగిన పోటీలో నాలుగు పాయింట్లు తేడాతో గుజరాత్‌ గెలుపొం దింది. మూడవ రోజు పోటీలకు ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి వి.శేఖర్‌, డైట్‌ కళాశాల అధ్యాపకులు జయరాం నాయుడు, రాజంపేట వైష్ణవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ పోలా రమణారెడ్డి, రాజంపేట మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ మర్రి రవి, కడప జియాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కరస్పాండెంట్‌ రాజారత్నం ఐజాక్‌, పిఇటిలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలకు ముందు ఆర్‌ఐపి ఇ.భానుమూర్తి రాజు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు.

➡️