59 మంది వాలంటీర్లు రాజీనామా

Apr 4,2024 23:00

ఎంపిడిఒకు రాజీనామా లేఖలు ఇస్తున్న వాలంటీర్లు
ప్రజాశక్తి సత్తెనపల్లి రూరల్‌, బెల్లకొండ :
సత్తెనపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న 49 మంది గ్రామ వాలంటీర్లు గురువారం రాజీనామా చేశారు. రెంటపాళ్ళలో 30 మంది ధూళిపాళ్ల లో 19 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామ పత్రాలను ఎంపిడిఒ జగదీష్‌కు అందచేశారు.

ప్రజాశక్తి – బెల్లంకొండ :
మండలంలోని పాపాయపాలేనికి చెందిన వాలంటీర్లు రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖలను ఎంపిడిఒ వెంకటరెడ్డికి గురువారం అందించారు. రాజీనామా చేసిన వారిలో మర్రి అనంతరెడ్డి, మర్రి రామచంద్రరెడ్డి, బత్తుల భూపతిరామారావు, బత్తుల సతీష్‌, తురక నాంచారయ్య, మర్రి మాధవి, పాలడుగు ప్రమీల, తెల్లమేకల చంద్రయ్య, చెల్లి జ్యోతి, భగ్గి లక్ష్మినారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా వారు జగన్మోహన్‌రెడ్డికి అండగా, తోడుగా నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

➡️