11న సిఎం జిల్లా పర్యటన ఖరారు

ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌/ కడప ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జిల్లా పర్యటన ఖరారు అయింది. ఈనెల 11న పులివెందుల నియోజకవర్గంలోని పలు అభివద్ధి పనులను ప్రారంభించనున్నారు. 11న ఉదయం 9 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 10.20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా పులివెందుల భాక్రాపురం హెలిప్యాడ్‌కు చేరుకొని 10.55కు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ప్రభుత్వానికి చేరుకుని ప్రారంభిస్తారు. తరువాత నల్లపరెడ్డిపల్లెలోని అరటి ప్యాక్‌ హౌస్‌ను, మినీ సచివాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత 12.30 గంటలకు వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ను , 12.35 కి సెంట్రల్‌ బోలె వార్డ్‌ను, జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను, గాంధీ జంక్షన్‌ను, ఉలిమెల్ల సరస్సును, ఆదిత్య మొదటి యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 2.35 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని వైయస్సార్‌ మెమోరియల్‌ పార్కును ప్రారంభిస్తారు. తర్వాత అక్కడే ఉన్న గెస్ట్‌ హౌస్‌లో 3 గంల అక్కడే ఉన్న గెస్ట్‌ హౌస్‌ లో 3 గంటల నుంచి 4 వరకు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుని గన్నవరానికి వెళ్తారు.ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మెడికల్‌ కళాశాల, జిజిహెచ్‌ లోని ఒపి, ఐపి, ఆపరేషన్‌ థియేటర్లు, ఎక్స్‌-రే, ఫార్మసీ బ్లాకులను, నర్సింగ్‌ కళాశాలను ,అరటి అంతర్జాతీయ ప్యాక్‌ హౌస్‌ తదితర ప్రాంతాలను కలెక్టర్‌ ఎస్‌పితో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు పక్కాగా ఉండాలని, తాగు నీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కడప ఎయిర్‌ పోర్టు, పులివెందుల హెలిప్యాడ్‌, పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల వద్ద ప్రోటోకాల్‌ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పకడ్బ ందీగా వుండాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్ర మంలో పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, డిప్యూటీ చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, పాడా ఒఎస్‌డి అనిల్‌ కుమార్‌ రెడ్డి, పులివె ందుల ఆర్‌డిఒ వెంకటేశం, వైద్య ఆరోగ్యశాఖ, ఎపిఎంఎస్‌ఐడిసి, విద్యుత్‌, ఆర్‌అండ్‌బి, పిఆర్‌ శాఖల ఇంజనీర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులుపాల్గొన్నారు.

➡️