11వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

11వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి-కాకినాడసమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె శనివారం 11వ రోజుకు చేరుకుంది. పిలుపుమేరకు జాతీయోద్యమ నాయకులు మహాత్మా గాంధీ, జగ్జీవన్‌రామ్‌, జ్యోతిబా ఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలను అందించారు. సత్య నాగమణి, పివివి.మహాలక్ష్మి, పి.రాజు, రమణ, పి.సునీత, వి.సుజాత, కె.అనంతలక్ష్మి మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేసి తీరాలని, జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రెగ్యులరైజ్‌ చేస్తానన్న హామీని అమలు జరిపేంతవరకు ఈ పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమ్మెకు యుటిఎఫ్‌ నాయకులు కెఎంఎంఆర్‌.ప్రసాద్‌, ఎం.తాతారావు, సిహెచ్‌.త్రిమూర్తులు, కె.రవీంద్ర, కె.ఈశ్వరరావు, సత్యన్నారాయణ, ప్రకతి కుమార్‌, డానియెల్‌ మద్దతు తెలిపి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, జెఎసి నాయకులు ఎ.లోవరాజు, సహాయ కార్యదర్శులు జి.నారాయణ, శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి పి.రాజు, ఎం.గంగాధర్‌ పాల్గొన్నారు.

➡️