Nov 29,2023 21:40
మాట్లాడుతున్న నాయకులు

మాట్లాడుతున్న నాయకులు
జీఓను సవరించి.. ఇళ్ల స్థలాలు అందించాలి.
.ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:
ఇళ్ల స్థలాల జీఓలు సవరించి..జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు వర్తింపజేసేలా జీఓను విడుదల చేయాలని ఏపీఎంఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఐ. మల్లికార్జున పేర్కొన్నారు. స్థానిక టౌన్‌ హాల్‌ సమావేశ మందిరంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 6 వందల మంది అక్రిడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులు ఉన్నారన్నారు. అక్రిడిటేషన్‌ లు రానివాళ్లు సుమారు 1500 మంది ఉన్నారనీ,ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్లు ఉన్న జర్నలిస్టులు సుమారు 75 శాతం మందికి వివిధ కారణాలతో ఇళ్ల స్థలాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఏళ్ల తరబడి జర్నలిస్టుల వత్తిని నమ్ముకొని, జర్నలిస్టులు జీవనం సాగిస్తున్నారన్నారు. వీరిలో కొందరికి 3 నుంచి ఆరు అంకణాల సొంత ఇళ్లలో పలువురు జర్నలిస్టులు జీవిస్తున్నారని తెలిపారు.తాత, ముత్తాతల నుంచి ఆ ఇల్లు సంక్రమించాయన్నారు. ఈ జీవో కారణంగా వాళ్లు కూడా అనర్హులయ్యే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్‌ తో సంబంధం లేకుండా జర్నలిజంలో పనిచేస్తున్న, ప్రతి ఒక్క జర్నలిస్టుకీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టు ఇళ్ల స్థలాలను పొందేల ప్రభుత్వం విడుదల చేసిన జీఓను సవరించాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టులు హజరత్తయ్య, వినరు తదితరులు పాల్గొన్నారు.

➡️