16న టిడిపిలో చేరనున్న మాగుంట

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఈనెల 16న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇటీవల మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసిపికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

➡️