17వ రోజుకు చేరుకున్న ఎస్‌ఎస్‌ఎల సమ్మె

Jan 5,2024 20:46

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవారం 17వ రోజు విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో పెద్దఎత్తున ఉద్యోగులు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీడీ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తమ నాయకులను అరెస్టు చేయడం దారుణమని, అలాగే జిల్లాకు చెందిన 65మంది సిఆర్‌టిలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టీపనట్టు వ్యవహరించడం సహేతుకంగాలేదని అన్నారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, పార్ట్‌టైం ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేయాలన్న తమ డిమాండ్లను పరిశీలించి, హెచ్‌ఆర్‌ పాలనీ అమలు చేసేదాక సమ్మెను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు ఎం.ఈశ్వరరావు, కాంతారావు, భాను ప్రకాష్‌, బివి రమణ, భారతి తదితరులతో పాటు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️