211 పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిసి కెమెరాలు

Apr 15,2024 23:37

పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌
ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల నియోజకవర్గంలో 211 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయి సిసి కెమోరాల పర్యవేక్షణ ఉంటుందని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ప్రసాదు అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో శాంతి, భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. మంచికల్లు, తుమృకోట గ్రామాల్లో ఇటీవల జరిగిన ఘటనల్లో కేసులు నమోదుతోపాటు పలువుర్ని ఆరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18 నుండి నామినేషన్స్‌ ప్రక్రియ ప్రారంభం ఆవుతుండగా 19వ తేదిన టిడిపి, వైసిపి పార్టీల అభ్యర్ధులు నామినేషన్స్‌ వేసేందుకు అనుమతి కోరినట్లు తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్య ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లకు ర్యాలీలకు వస్తే సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. ర్యాలీలకు అనుమతిచ్చే అవకాశం ఉండదని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అదనపు బలగాలను కోరినట్లు తెలిపారు.

➡️