29, 30న గిరిజన విద్యారంగ పరిరక్షణకు ధర్నా

Jan 27,2024 21:38

ప్రజాశక్తి-పార్వతీపురం: గిరిజన విద్యారంగ పరిరక్షణకు ఈ నెల 29, 30 తేదీల్లో సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎల వద్ద యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్ములు టి.రమేష్‌, ఎస్‌.మురళిమోహన్‌రావు, గిరిజన సంఘం నాయకులు కె.అవినాష్‌, లక్ష్మణరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పండు, రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ధర్నా పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిఒ 3ని పునరుద్ధరించాలని, నాన్‌షెడ్యూల్డ్‌ ఏరియా గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని, సవర భాషా వాలంటీర్లను మార్చి, ఏప్రిల్‌ కొనసాగించాలని, సిఆర్‌టిసిలను రెగ్యులర్‌ చేయాలని, తదితర డిమాండ్లపై ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. 29న సీతంపేట, 30న పార్వతీపురం ఐటిడిఎల వద్ద మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవతం చేయాలని కోరారు.

➡️