32వ రోజుకు మిమ్స్‌ ఉద్యోగుల నిరశన

Mar 3,2024 21:11

ప్రజాశక్తి – నెల్లిమర్ల : స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరశన శిబిరం 32వ రోజుకు చేరుకుంది. ఆదివార నిరశన శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ సందర్శించి మాట్లాడుతూ నెల గడుస్తున్న మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించక పోవడం అన్యాయమన్నారు. ముఖ్యంగా జనవరి నెల పనిచేసిన కాలానికి జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే 7 డిఎ బకాయిలు, వేతన ఒప్పందం చేయాలని గత నెల రోజులుగా మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు నిరశన పోరాటం చేస్తుంటే యాజమాన్యం గాని ప్రభుత్వ అధికార్లు గానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు కూడా మనకెందుకులే అన్న విధంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పలికి వారి సమస్యలు పరిష్కరానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు కొమ్మూరి మధు, మహంతి రాంబాబు, అప్పలనాయుడు, గౌరి, బంగారు నాయుడు, నాగభూషణం, ఆదినారాయణ, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️