92 మందికి ‘సినర్జీస్‌’లో ఉద్యోగాలు

ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్ర వారం సినర్జీస్‌ కాస్టింగ్స్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో వివిధ విభాగాలకు చెందిన 92 మంది విద్యార్థినులు అదే సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 39 మంది, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ విభాగానికి చెందిన 37 మందికి, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన నలుగురు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగానికి చెందిన 12 మందికి ఉద్యోగాలకు ఎంపిక చేసిన సినర్జీస్‌ సంస్థ ప్రతినిధులు, వారికి ఆఫర్‌ లెటర్లు అందజేశారు. ఎంపికైన వారికి ఏడాదిపాటు రూ.14వేలు గౌరవవేతనంతో శిక్షణనిస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సిహెచ్‌ మురళీకృష్ణ, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి పి శ్రీనివాస్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ శాఖాధిపతి డాక్టర్‌ జి.రాజేశ్వరి, సంస్థ ప్రతినిధులు సుబేదా బేగం, సీనియర్‌ అధికారి పేరోల్‌పాల్గొన్నారు.

ఆఫర్‌ లెటర్లతో ఎంపికైన విద్యార్థినులు

➡️