Mar 4,2024 22:02

ఉపాధి కోల్పోతున్న విద్యుత్‌ హమాలీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ పరికరాలు సరఫరా చేసే ఎస్‌పిడిసిఎల్‌ జిల్లా సోర్ట్పులో దాదాపు 30 సంవత్సరాలుగా విద్యుత్‌ హమాలీలు పనిచేస్తున్నారు. ఎస్‌పిడిసిఎల్‌ జిల్లా స్టోర్సుకు వచ్చే విద్యుత్‌ పరికరాలను లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే కూలి డబ్బులే జీవనాధారంగా వీరు జీవిస్తున్నారు. జిల్లా స్టోర్స్‌కు వచ్చే విద్యుత్‌ పరికరాలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటాయి. అయితే ప్రస్తుతం జిల్లా స్టోర్స్‌కు వస్తున్న 25 కేవి ట్రాన్స్‌ఫార్మర్లను ఆపేశారు. ఏ కారణంతో ఆపేశారన్న విషయం ఇక్కడి కూలీలకు తెలీక సతమవుతున్నారు. విద్యుత్‌శాఖ అధికార్లను అడిగితే సమాధానం లేదు. పిభ్రవరి నుండీ ఉన్నట్లుండి 25 కె.వి ట్రాన్స్‌ఫార్మర్లు ఆపివేయడంతో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కార్మికుల రోజువారి కూలి తగ్గిపోతోంది. జిల్లా స్టోర్సుకు సరఫరా అవుతున్న 25 కె.వి విద్యుత్‌ టాన్స్‌ఫార్మర్లు సదుం, మొలకలచెరువు, పుత్తూరుకు పంపుతున్నారు. జిల్లా కేంద్రం నుండీ సరఫరా చేస్తున్న వీటిని ఎందుకు మార్చేరో….. అంతుపట్టని ప్రశ్నగా ఉంది. జిల్లా విద్యుత్‌ స్టోర్సులో పనిచేస్తున్న విద్యుత్‌ హమాలీలు 25.కెవి ట్రాన్స్‌ఫార్మర్లు ఇక్కడికి సరఫరా చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించడంతో నెలవారీ కూలి తగ్గిపోతంది. వీరి కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా తిరిగీ 25.కెవి ట్రాన్స్‌ఫార్మర్లు జిల్లా కేంద్రాంలోని ఎస్‌పిడిసిఎల్‌ స్టోర్సుకు చేర్చి అక్కడి నుండీ ఇతర ప్రాంతాలకు తరలించాలిని విద్యుత్‌ హమాలీలు కోరుతున్నారు. కూలీల కడుపు కొడుతున్నారు- ఎం.ఆరోగ్యదాస్‌, ఎస్‌పిడిసిఎల్‌ విద్యుత్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు 30 సంవత్సరాలుగా ఎస్‌పిడిసిఎల్‌ స్టోర్సును నమ్ముకొని వందల మంది కూలీలు పనిచేస్తున్నారు. వచ్చే కూలీ డబ్బు తక్కువైనా కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్నారు. పిభ్రవరి రెండో తేదీ నుండీ 25 కె.వి ట్రాన్స్‌ఫార్మర్లు జిల్లా సోర్సుకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. గతంలో లాగా 25 కెవి ట్రాన్స్‌ఫార్మర్లు జిల్లా ఎస్‌పిడిసిఎల్‌ స్టోర్సు నుంచే ఇతర ప్రాంతాలకు తరలించాలి. హమాలీలకు అన్యాయం చేయాలని చేస్తే పోరాటం చేయాల్సి ఉంటుంది.

➡️