ట్రాక్టర్‌ను ఢకొీన్న లారీ

ప్రజాశక్తి- అద్దంకి : ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢకొీన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని శ్రీనివాసనగర్‌ గ్రామ సమీపంలో నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డుపై గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బల్లికురవ మండలం ఎస్‌ఎల్‌. గుడిపాడుకు చెందిన జగదీష్‌ (18) తాను మొక్కజొన్న పంటను ట్రాక్టర్‌లో ఉప్పలపాడు గ్రామంలోని తన మేన మామ ఇంటికి తరలిస్తున్నాడు. అదే సమయంలో నరసరావుపేట నుంచి అద్దంకి వైపు వస్తున్న లారీ వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢకొీంది. దీంతో జగదీష్‌ అక్కడికక్కడే మతి చెందాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ రవికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి వివరాలను సేకరించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️