మద్యం, మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దాలి

Feb 20,2024 14:40 #Kakinada

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కోనసీమ) : మద్యం మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు నాయకులతోపాటు ప్రజలు కృషి చేయాలని మద్యపాన నిషేధ ప్రసార కమిటీ అధ్యక్షులు బి.ప్రభుదాస్‌ అన్నారు. మంగళవారం అమీనాబాద్‌ జంక్షన్‌ నుండి మాయా పట్నం, సురడ పేట మీదగా ఉప్పాడ పంచాయతీ పరిధిలో ఉన్న పలు గ్రామాలలో మద్యపాన నిషేధం పట్ల అవగాహన కల్పిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్ని సేవించడం వల్ల ఆరోగ్యాల గుల్ల అవుతున్నాయని ఇంటి యజమాని మృతి చెందితే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా తయారవుతున్నాయని తెలిపారు. మద్యాన్ని వీడి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రభుత్వాలు మాత్రం ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం పై వాగ్దానాలు ఇస్తున్నారే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మద్యపాన నిషేధ ప్రసార కమిటీ ఉపాధ్యక్షులు ఎం కరుణ ప్రసాద్‌, జిల్లా కన్వీనర్‌ఎన్‌ సూర్యనారాయణ, కే నాగేశ్వరరావు, పాల్‌ రాజ్‌, కూరాకుల సింహాచలం, ఎం రఫీస్‌, గుర్రాల ప్రసాద్‌, ఏలేటి నాని బాబు, పిల్లి శ్రీను, వేమగిరి తలుపులయ్య,తరుణ్‌, చంటి మెహర తదితరులు పాల్గొన్నారు.

➡️