సాయిబాబా హైస్కూల్‌లో పెచ్చులూడిన తరగతి గది పైకప్పు

ప్రజాశక్తి కడప అర్బన్‌ కడప నగరంలోని ఐటిఐ సర్కిల్‌లో వైసిపి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాఠశాల మూడో అంతస్థులో ఉన్న 8వ తరగతి గది స్లాబ్‌ పెచ్చులు ఊడి పడింది సంఘటనలో పాఠాలు వింటున్న ఆరుగురి విద్యార్థులకు గాయా లయ్యాయి. వారిలో ఒక విద్యార్థి తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం వారిని యాజమాన్యం నగరంలోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. సాయిబాబా పాఠశాలలోని 8వ తరగతి ఇ-1 సెక్షన్‌ గదిలో మధ్యాహ్నం సమయంలో ఉపాధ్యాయులు బోధించే సమీపంలో మూలన ఉన్నట్టుండి స్లాబ్‌ పైకప్పు పెచ్చులూడింది. అక్కడ బెంచ్‌లో కూర్చుని పాఠాలు వింటున్న విద్యార్థులకుపై పడడంతో ఆరుగురికి విద్యార్థులకు గాయాలయ్యాయి. ఊహించని సంఘటనతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్పందించిన యాజమాన్యం గాయపడిన విద్యార్థులను వెంటనే ప్రయివేట్‌ హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందించారు. ఒక విద్యార్థికి తలకు గాయమై కుట్లు పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని కనీసం వసతులు, నిబంధనలు పాటించని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సాయిబాబా పాఠశాల కరస్పాండెంట్‌ ఎం.వి. రామచంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. అక్కాయపల్లెలోని ఐటిఐ సర్కిల్‌ వద్ద ఉన్న ప్రయివేట్‌ పాఠశాలలో పైకప్పు కూలి ఆరుగురు విద్యార్థులు గాయపడిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని, సంబంధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. అలానే నిబంధనలు పాటించకుండా స్కూలు నడుపుతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని అంటూ పోస్ట్‌ చేశారు. ఇదే ఘటనపై కడప ఎమ్మెల్యే మాధవి స్పందిస్తూ పాఠశాలపై కప్పు కూలి విద్యార్థులకు గాయాలు కావడం బాధాకరం. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాను. ఈ సంఘటనపై డిఇఒ వెంటనే స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. చట్ట విరుద్ధంగా పాఠశాల నడుస్తున్నట్లు తమ వద్ద గతంలోనే సమాచారం ఉందని తెలిపారు. తాలుకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనపై విచారించారు.సాయిబాబా స్కూల్‌ గుర్తింపును రద్దు చేయాలి – విద్యార్థి, యువజన సంఘాల నాయకుల డిమాండ్‌ప్రజాశక్తి- కడప అర్బన్‌ నగరంలోని ఐటిఐ కూడలిలో ఉన్న సాయిబాబా స్కూల్‌ యాజ మాన్యం నిర్లక్ష్యం కారణంగా స్కూల్‌ పై కప్పు కూలి 8వ తరగతి విద్యా ర్థులు తీవ్రంగా గాయ పడ్డారని, స్కూలు గుర్తింపు రద్దు చేయాలని, సంఘ టనకు బాధ్యునిగా ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిని అరెస్టు చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేయా లని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. స్కూల్‌ ఎదుట విద్యార్థి యువజన సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేందర్‌ ప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎద్దు రాహుల్‌, గండి సునీల్‌ కుమార్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి వలరాజు, ఎన్‌ఎస్‌ యుఐ జిల్లా అధ్యక్షుడు బాబు, పిఎస్‌యు గోపి, పిఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సన్నీ, ఎఐవైఎల్‌ జిల్లా నాయకులు ఓబయ్య మాట్లాడుతూ ంత జరుగుతున్నా డిఇఒ, ఆర్‌జెడి కనీసం స్కూల్‌ తనిఖీ కూడా రాలేదని చెప్పారు. ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి కనీస వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు దగ్గర వేల రూపాయలు వసూలు చేసి, అక్రమ డబ్బుతో ఎమ్మెల్సీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. నిబం ధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్న విద్యాశాఖ చర్యలు తీసుకోకపోవడం దేనికి నిదర్శనమన్నారు. సాయిబాబా స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి, ఉపాధ్యక్షులు మనోజ్‌, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ నర్సింహులు, మిగతా విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొన్నారు.

➡️