ప్రమాదాలకు నిలయంగా ఆదినిమ్మాయపల్లె డ్యామ్‌

  • సూచిక బోర్డు లేకనే ప్రమాదాలు
  • ఒకే నెలలో ముగ్గురు మృతి

ప్రజాశక్తి -వల్లూరు : ఆదినిమ్మాయపల్లె డ్యామ్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రమాదాలు అధికంగా అక్కడ సూచిక బోర్డు లేకపోవడమేనని స్థానికులు పేర్కొంటున్నారు. డ్యామ్‌ను సెలువు రోజుల్లో, పండగలప్పుడు పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడ నీటిలో సరదాగా గడుపుతుంటారు. ఇలా నీటిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలా మందే ఉన్నారు. డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన నీటి గుంటలున్నాయి. వాటి గురించి తెలియని వారు అందులో దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే పర్యాటకులు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడుతారు. ఒకే నెలలోనే ఆదినిమ్మాయపల్లె డ్యామ్‌లో పడి ముగ్గురు మృతిచెందారు. ఇప్పటికైనా అధికారులు ప్రమాదాల నివారణకు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించాలి.. అదినిమ్మాయపల్లి డ్యాం వద్ద పర్యాటకుల సందర్శుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎంతోమంది సరదాగా గడపడానికి దూర ప్రాంతాల నుంచి డ్యామ్‌ వద్దకు వచ్చి నీటిలో గడుపుతూ ఉంటారు. అక్కడక్కడ సుడిగుండాలు, గుంతలు ఉండడంతో వారికి అవగాహన లేక నీటి కుంటలో పడి మతి చెందుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలంటే తప్పనిసరిగా ప్రమాద సూచిక బోర్డులు అక్కడక్కడా మడుగులు ఉన్నచోట ఏర్పాటు చేస్తే వారి ప్రాణాలు వాళ్లే రక్షించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్నోసార్లు మతి చెందిన వారిని నేనే బయటకు తీశాను. అధికారులు వెంటనే స్పందించి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.-అంజిరెడ్డి, స్థానికుడు

➡️