ఎంఎల్‌ఎ కాకర్లకు శుభాకాంక్షలు

Jun 15,2024 21:52
ఫొటో : ఎంఎల్‌ఎ కాకర్ల సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న టిడిపి నేతలు

ఫొటో : ఎంఎల్‌ఎ కాకర్ల సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న టిడిపి నేతలు

ఎంఎల్‌ఎ కాకర్లకు శుభాకాంక్షలు

ప్రజాశక్తి-సీతారామపురం : ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్‌ను వింజమూరులోని టిడిపి కార్యాలయంలో శనివారం సీతారామపురం మండలానికి చెందిన పలువురు టిడిపి నేతలు కలిసి ఉదయగిరి ఎంఎల్‌ఎగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకర్ల సురేష్‌ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గం అన్నివిధాల అభివృద్ధి చెందుతుందని, మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సీతారామపురం మండలానికి అత్యధిక నిధులను వెచ్చించి అన్ని విధాల అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నియోజకవర్గంలోని పేద ప్రజలందరినీ అన్ని విధాల ఆదుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఎంఎల్‌ఎ పదవితో మరింతగా ప్రజలకు సహాయం చేస్తారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని ఎంఎల్‌ఎ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి మేరకే రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పట్టం కట్టారని, రాష్ట్ర అభివృద్ధి వైపు బాటలు వేసేలా టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. ఉదయగిరి నియోజకవర్గంపై ప్రత్యేక చొరవ చూపి అత్యధిక నిధులు తీసుకువచ్చే సత్తా ఉన్న నాయకుడు కాకర్ల సురేష్‌ అని గతంలో ఏ నాయకుడు చేయని విధంగా ఉదయగిరి ప్రాంతం రాబోయే ఐదు సంవత్సరాలలో అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. సీతారామపురం మండలానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. కాకర్ల విజయంపై సీతారామపురం మండల ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జి వెంగలశెట్టి వెంకటేశ్వర్లు, మండల పార్టీ మాజీ కన్వీనర్‌ చెన్నకేశవులు, టిడిపి యువ నాయకులు ఎడమ ప్రవీణ్‌, అధవేని రఘురామయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️