అంగన్వాడీల భిక్షాటన…వంటావార్పు

అనంతగిరిలో భిక్షాటన చేస్తున్న అంగన్‌వాడీలు

 

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది. మండల కేంద్రంలో భిక్షాటనతో నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షురాలు కే.కొండమ్మ మాట్లాడుతూ, న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మె ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి సత్యవతి, పవిత్ర, మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అరకులోయ రూరల్‌:మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్లు,హెల్పర్లు భిక్షాటన చేశారు. ఈ సందర్బంగా అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ, ప్రతీ పక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతాలు పెంచుతామని మాయమాటలు చెప్పి అంగన్వాడిలను తీవ్రంగా మోసం చేశారని ధ్వజమెత్తారు.ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుతున్నామన్నారు.సచివాలయం ఉద్యోగులతో అంగన్వాడి సెంటర్ల తాళాలు బద్దలు కొట్టించడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో డి.నాగమ్మ, పి వెంకట్‌ లక్ష్మి, కె.లక్ష్మి, నిర్మల పాల్గొన్నారు.ముంచింగిపుట్టు:అంగన్వాడీల సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు గల్లేలా నారాయణ, జీనబంధులు మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, 9 రోజుల నుంచి నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరిం చాలన్నారు. అంగన్వాడి సంఘం నాయకులు అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.హుకుంపేట:- మండలంలోని అంగన్వాడి టీచర్లు న్యాయమైన డిమాండ్లతో చేపట్టి నిరసన బుధవారం 9వ రోజు చేరుకుంది. సమ్మె సందర్భంగా మహిళా సంఘం అల్లూరి జిల్లా కార్యదర్శి ఎస్‌.హైమావతి. ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిసి కార్యాలయం నుంచి మూడు రోడ్లు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అంగన్వాడి టీచర్లకు రూ.26000 వేతనం చెల్లించాలంటూ భిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్‌ నాయకులు అప్పలకొండమ్మ, కృష్ణవేణి పాల్గొన్నారు.పెదబయలు :స్థానిక అంబేద్కర్‌ కూడలి జంక్షన్‌ వద్ద అంగన్వాడీలు సమ్మె కొనసాగించారు. మధ్యాహ్నం శిబిరం వద్ద భోజనాలు చేసి నిరసన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సమ్మెకు యూనియన్‌ నాయకురాలు రాజమ్మ, పద్మ, మంగమ్మ, సుశీల, సీఐటీయూ జిల్లా కమిటీ నాయకులు సన్నిబాబు, మాజీ ఎంపీపీ వి కొండయ్య , లక్ష్మీపేట సర్పంచ్‌ అశోక్‌ పాల్గొన్నారు. అనంతగిరి:మండల కేంద్రంలో అంగన్వాడిలు భిక్షాటన చేపట్టారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకురాలు పి.కళావతి, .కుమారి, చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీల భిక్షాటనప్రజాశక్తి -ఎటపాక : గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం భిక్షాటన చేశారు. అంగన్వాడిల పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుంజా విజయకుమారి, రాజ్యలక్ష్మి, సుజాత, రమ్య, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.విఆర్‌.పురం : మండల కేంద్రం రేఖపల్లి జంక్షన్‌లో 9వ రోజు నిరసన కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా సభ్యులు సున్నం రంగమ్మ ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి దుకాణానికి వెళ్లి తమ సమస్యలను చెబుతూ భిక్షాటన చేశారు. కార్యక్రమంలో ఎంపిపి కారం లక్ష్మి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనం సత్యనారాయణ, ఐద్వా నాయకులు ఐ.పద్మ, సున్నం పార్వతి, యూనియన్‌ నాయకులు నాగమణి, రాజేశ్వరి, సిపిఎం నాయకులు సోయం చిన్నబాబు, పంకు సత్తిబాబు, వీర్ల నాగేశ్వరరావు, హాజరత్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సుధీర్‌ పాల్గొన్నారు.ఒంటి కాలిపై నిరసన రంపచోడవరం : అంగన్వాడీల తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని చేపట్టిన నిరసన దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో బుధవారం ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కె.రామలక్ష్మి, కె మంగాయమ్మ, బి సింగారమ్మ, ఎం సత్యవేణి, అంగన్వాడీలు పాల్గొన్నారు.చింతూరు : అంగన్వాడీ 9వ రోజు నిరసన కార్యక్రమాన్ని సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌, సీనియర్‌ నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌ రాజమండ్రి జిల్లా అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో తుమ్మల ఎంపీటీసీ వేక రాజ్‌ కుమార్‌, సిపిఎం నాయకులు పల్లపు పెద్ద రాములు, మొట్టం రాజయ్య, పొడియం లక్ష్మణ్‌, యూనియన్‌ నాయకులు వెంకటరమణ, స్వరూప, పార్వతి, వసంత, దుర్గ, చిట్టమ్మ, కిట్టమ్మ, వీరమ్మ, కనకదుర్గ, సత్యవతి, విజయ కుమారి పాల్గొన్నారు.మారేడుమిల్లి : మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం నాటికి తొమ్మిదవ రోజు చేరాయి. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నిర్మల కుమారి, ప్రసూన, మారేడుమిల్లి, వై.రామవరం మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.రాజవొమ్మంగి : మండల కేంద్రంలోని ఆర్‌ అండ్బి అతిథి గృహం ఎదురుగా అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్ష 9వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యూనియన్‌ మండల కార్యదర్శి కె వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఆశా యూనియన్‌ నాయకులు ఎ.అమ్మిరాజు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నములు, కుమారి, సత్యవతి, మంగ, రాజేశ్వరి, రాణి, రమణి, సుందరమ్మ, సూర్యకుమారి పాల్గొన్నారు.

➡️