గిరిజనుల వినూత్న నిరసన

Feb 3,2024 23:49
మొండిబోరుకు మొక్కుతున్న గిరిజనులు

ప్రజాశక్తి -అనంతగిరి: తాగునీటి సరఫరా చేయాలని పివిటిసి గిరిజనులు మొండి బోరు వద్ద పూజలు చేస్తూ వినుత్న రీతిలో నిరసన చేపట్టారు. తాగునీటి సరఫరా చేయండి ప్రభో అంటూ వేడుకుంటున్నారు. అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ పరిధి కొండ శిఖరు చీడీవలస గ్రామంలో శనివరం వినూత్న రీతిలో ఆదిమ జాతి పివిటీజీల గిరిజనులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ వైస్‌ సర్పంచ్‌ కిల్లో నాగేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తమ పివిటిసిలకు కల్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నాయని తప్పా ఆచరణలో అమలు కాలేదన్నారు. తమ గ్రామానికి తాగునీటి సమస్య పరిష్కరించేందుకు 2021 సంవత్సరంలో బోరు నిర్మించారన్నారు. కరెంటు మోటారు బిగించి తమ 25 కుటుంబాలకు ఇంటింటి పైపులైన్‌ కలెక్షన్‌ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయవలసినప్పటికీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు ఎటువంటి పనులు నేటికీ చేపట్టలేదన్నారు. దీంతో తమ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కలుషితమైన ఊట నీటిని ఆశ్రయించి రోగాల బారిన పడుతున్నామని, తక్షణమే కరెంటు మోటారు కలెక్షన్‌ బిగించి తాగునీటిని సరఫరా చేయలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు గెమిలి చిలకమ్మ, కిల్లో, కుమారి తదితరులు పాల్గొన్నారు

➡️