టిడిపి పథకాలపై ప్రచారం

Jan 29,2024 23:23
ప్రచారం చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:మండలంలోని వంతడపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కిల్లు రమేష్‌ నాయుడు సోమవారం పర్యటించారు. తెలుగుదేశం పార్టీ సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో టిడిపి విజయానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం మేనిఫెస్టో, పథకాలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే విధంగా ఉందని కొనియాడారు. రాష్ట్రంలో నిరంకుశ పరిపాలనను స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి నేటికీ నాలుగున్నర సంవత్సరాలు దాటుతున్నా అభివృద్ధి కను చూపుమేర కనపడలేదని హెద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌ బాలరాజు, మాజీ సర్పంచ్‌ రమాదేవి, మాజీ ఎంపీటీసీ సభ్యులు అడపా నరసింహారెడ్డి నాయుడు, సాగేని. బొంజుపడల్‌. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు శోభ శ్రీనివాసరావు, శివ కేశవ. శంకర్‌ నాయుడు పాల్గొన్నారు.

➡️