దుకాణాల తొలగింపు

దుకాణాలు తొలగిస్తున్న ఎస్‌ఐ

ప్రజాశక్తి-హుకుంపేట:మండలం కేంద్రంలోని శనివారం నిర్వహిస్తున్న వారపు సంతల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ సతీష్‌ సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను సిబ్బందితో తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వారపు సంతలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలని కోరారు. సంతల్లో ఇరువైపులా అమ్మకాలు చేపడితే దుకాణాల ఏర్పాటుకు అనుమతించమని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా సంత నిర్వహించాలని ఆయన సూచించారు. ఖాళీ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

➡️