నంమంచు ముసుగులో అరకులోయ :

Feb 1,2024 00:25
మంచులో వెలుతురు వెళుతున్న

అరకులోయ ప్రజాశక్తి-అరకులోయ :పర్యాటక కేంద్రమైన అరకులోయ కు మంచు ముసుగు కమ్ముకుంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల నుంచి చలి తీవ్రత కూడా తీవ్రంగా పెరగడంతో ఈ ప్రాంతంలో వాసులు గజగజ వణుకుతున్నారు. గతంలో నవంబర్‌,డిసెంబర్‌ నెలలో అధికంగా మంచుతో ఈ ప్రాంతం కప్పబడి ఉండేది అయితే ఈ ఏడాది దట్టమైన పొగ మంచు ఉదయం సాయంత్రం వేళలో కమ్ముకుంటుండడంతో ఇటూ పర్యాటకులు మంచును ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలోని గిరిజనులు, వాహన చోదకులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అరకు- విశాఖ ఘాట్‌ రోడ్డులో ఉదయం, సాయంత్రం వేళలో ప్రయాణించాలంటేనే భయాందోళన చెందుతున్నారు. దట్టమైన పొగ మంచు కమ్ముకుంటుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ప్రతి వాహనదారుడు కూడా మంచు వల్ల పగటివేళ్లలో కూడా వాహనాలకు లైట్లు వేసి ప్రయాణించడం ఈ సీజన్లో పరిపాటిగా మారింది. పొగమంచు, చలి అధికంగా ఉండడంతో అనేకమంది పర్యాటకులు పలు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు.

➡️