నల్ల రిబ్బన్లు ధరించి నిరసన

రిలే దీక్షలు

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజ నేతరురాలు బుడ్డిగా కొండమ్మ ఇల్లు, షాపులు కూల్చి వేయాలని ఆదివాసి గిరిజనులు చేస్తున్న రిలే దీక్షలు శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. నల్లని రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. అనంతరం అదివాసీ గిరిజనులు మాట్లాడుతూ, గిరిజనేతరులకు సహకరిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అక్రమ కట్టడాలు కూల్చే వరకు దీక్షలు ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో అదివాసీ నాయకులు కిల్లో రామారావు, డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కో కన్వీనర్‌ కుడేలి నూకరాజు, ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు సీ హెచ్‌ రాజు, ఆదివాసీ గిరిజన నాయకులు పాడి సుమన్‌, నర్సింగరావు, సూరిబాబు, కొర్ర ఆనంద్‌, బాలన్న పాల్గొన్నారు.

➡️