నాంది ఫౌండేషన్‌ బృందం పర్యటన

స్వాగతం పలుకుతున్న లక్కు

ప్రజాశక్తి-పాడేరు: మండలంలోని గురగరువు గ్రామాన్ని నాంది ఫౌండేషన్‌ ప్రతినిధులు గురువారం సందర్శించారు. బెస్ట్‌ విలేజ్‌ బెస్ట్‌ ఫార్మర్‌ ఎంపికలో భాగంగా పరిశీలనకు ఈ నాంది ప్రతినిధి బృందం ఈ గ్రామంలో పర్యటించింది. ఈ గ్రామానికి చెందిన గిరిజన కాఫీ రైతుల సంఘం జాతీయ సభ్యుడు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు పాలికి లక్కు నాంది ప్రతినిధులకు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో కాఫీ సాగు చేపడుతున్న సాగు విస్తీర్ణం, దిగుబడి, తదితర విషయాలను లక్కు వారికి వివరించారు.

➡️