పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు

వి.అభిషేక్‌ ఆదేశించారు

ప్రజాశక్తి-ప్రజాశక్తి-పెదబయలు: ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అరకు నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ ఆదేశించారు. మండలంలో శనివారం పర్యటించిన ఆయన గసభ, గంపరాయి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసారు. ఓటింగ్‌ యంత్రాల ఏర్పాటు, ప్రవేశం తదితర వాటిపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, బూత్‌ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.పాడేరు:బలమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని అరకు రిటర్నింగ్‌ అధికారి ఐటిడిఏ పిఓ అభిషేక్‌ స్పష్టం చేసారు. శనివారం ఆయన కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, ఓటు వినియోగంపై ఎన్నికల కమిషన్‌ రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఓటరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని స్పష్టం చేసారు. ఓటు ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్‌ వి.వి.ఎస్‌. శర్మ, జి.మాడుగుల డిప్యూటీ తహశీల్దార్‌ అప్పల స్వామి, పిఎంయు ప్రోగ్రాం అధికారి రామ్‌ గోపాల్‌ పాల్గొన్నారు.ఎన్నికలపై సమీక్షఅనంతగిరి:మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎంపీడీవో నగేష్‌, ఎస్‌ఐ రాము, తహసిల్దార్‌ నాగ జోతిలు మాట్లాడుతూ, ఎన్నికల కోడ్‌ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. రూ.50 వేలకు మించి నగదు రవాణా చేసేటప్పుడు రసీదులు అవసరమన్నారు. లేకుంటే కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని ఆదేశించారు. పార్టీ నాయకులు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపిటిసిలు, సర్పంచులు, వివిధ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారునిబంధనలు కచ్చితంగా పాటించాలిడుంబ్రిగుడ:ఎన్నికల నిభందనలను కచ్చితంగా పాటించాలని తహసీల్దార్‌ హైమావతి సూచించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. ఎన్నికల నిభందనలను పాటించి ప్రచారాలకు అనుమతులు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికల కమిషన్‌ తీసుకునే చర్యకు బాధ్యులవుతారని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి, వైసిపి, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, భాజపా, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.

➡️