షోకాజ్‌ నోటీసులతో బెదిరింపులు

అనంతగిరిలో జిఒ కాపీలను చూపుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం కొనసాగింది. జిల్లాలో పలు చోట్ల వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేసి బెదిరించడం సరికాదని పేర్కొన్నారు.పాడేరు:జిల్లా కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు బుధవారం సమ్మె నిర్వహిస్తున్న శిబిరం వద్ద నుంచి సీడీపీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చేయకుండా తమకు వర్తించని ఎస్మా చట్టం తీసుకొచ్చి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యవర్గ సభ్యులు ఎల్‌ సుందర్రావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ నాయకులు జయ, చిన్నారి, విజయ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.అరకులోయ :తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు తాము విధుల్లోకి చేరేది లేదని ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారాణి శారధకు స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు, హెల్పర్లు సంజాయిషీ నోటీసులు ఇచ్చారు.విధుల్లోకి చేరకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరింపు చర్యలకు పాల్పడడంపై స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఐసిడిఎస్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి సిడిపిఓకు నోటీసుకు సంజాయిషి ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉదృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు దుర్య నాగమ్మ, నిర్మల, రాధ, లక్ష్మి, రాధా భారతి, వివిధ సెంటర్లకు చెందిన అంగన్వాడీలు హెల్పర్లు పాల్గొన్నారు.డుంబ్రిగుడ:సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడి కార్మికులు చేపడుతున్న సమ్మె మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని హైవే రోడ్డు యూనియన్‌ బ్యాంక్‌ జంక్షన్‌ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేపడతామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కే.కొండమ్మ, సత్యవతి, అంగన్వాడి కార్మికులు, హెల్పర్లు పాల్గొన్నారు. అనంతగిరి: సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యాన జీవో కాపీలు చేత పట్టి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కిల్లో మొస్య మాట్లాడుతూ, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి మండల యూనియన్‌ నాయకురాలు పి,మంజుల, సిఎస్‌ కళావతి, కె.లక్ష్మి, చిలకమ్మా, సుమిత్ర పాల్గొన్నారుఅంగన్వాడీల భిక్షాటనవిఆర్‌.పురం :తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 37వ రోజుకు చేరింది. ఇందులో బుధవారం మండలంలోని సున్నం వారి గూడెం, చిన్నమట్టపల్లి గ్రామాల్లో అంగన్వాడీ వర్కర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఇంటింటికి వెళ్లిన అంగన్వాడీలను సిపిఎం మాజీ ఎంపీపీ సున్నం నాగమ్మ, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కుమార్తె స్వరాజ్యం తదితరులు సాదరంగా ఆహ్వానించి, ఆర్థిక చేయుతను అందించి, వారి పోరాటానికి మద్దతు పలికారు.సమస్యలను పరష్కరించాలని ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సున్నం నాగమ్మ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సున్నం రంగమ్మ, రాజేశ్వరి, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.మారేడుమిల్లి : 37వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల దీక్షలకు వేటుకూరు సర్పంచ్‌ ఈతపల్లి మల్లేశ్వరి బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రత్నకుమారి, ప్రసూన మారేడుమిల్లి, వై.రామవరం పాల్గొన్నారు.రాజవొమ్మంగి : స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం ఎదురుగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన నాటికి 37వ రోజుకు చేరింది. శిబిరాన్ని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు కుంజం జగన్నాథం, కొండ్ల సూరిబాబు, పాండవుల సత్యనారాయణ బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోతా రామారావు మాట్లాడుతూ పండుక కానుకలు ఇస్తానని నమ్మించిన జగన్‌ అంగన్వాడీలను పండుగ రోజున కూడా సమ్మెలో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సిహెచ్‌ కుమారి, కె వెంకటలక్ష్మి, ఎల్‌ సత్యవతి, రమణి, రత్నం, చిన్నమ్మలు, సుందరమ్మ, నాగమణి, రాధ, భవాని, రాజేశ్వరి, లక్ష్మీ, వీరయ్యమ్మ, వీరలక్ష్మి పాల్గొన్నారు.అడ్డతీగల : స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళనలో పాల్గొన్న అంగన్వాడీలకు బుధవారం మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జర్తా వెంకటరమణారెడ్డి, వడ్డి రాంబాబు, మేడిశెట్టి శ్రీను, కామన కృష్ణమూర్తి, జుజ్జువరపు శ్రీనివాస్‌ చౌదరి, ఎడ్ల శ్రీను, కట్రు రాఘవ, సత్తి సత్తిరెడ్డి, పోలురాజు ఈశ్వర్‌ రెడ్డి, కంట్రోజు శ్రీనివాస్‌ రెడ్డి, బండ్రాజ్‌ వీర్‌రెడ్డి, మడిగట్ల రమేష్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️