సిఎం పర్యటనకు భారీ బందోబస్తు

ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్‌పి

 

ప్రజాశక్తి- చింతపల్లి: చింతపల్లిలో ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీస్‌ బలగాలను ఉపయోగిస్తున్నట్టు అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్‌ సీన్హ చెప్పారు. చింతపల్లి సమీపంలో హెలిపాడ్‌ నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చింతపల్లి పరిసరాలలో కోరుకొండ, అన్నవరం, గాలికొండ సప్పర్ల, మంప, దారకొండ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌ స్పెషల్‌ పోలీసు బలగాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ చెప్పారు, ఇతర జిల్లాల నుండి పోలీస్‌ బలగాలను రప్పించి శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగిస్తున్నామని చెప్పారు.

➡️