సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

డుంబ్రిగుడలో వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నేతలు

ప్రజాశక్తి -డుంబ్రిగుడ:కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జన్మదిన కేకును కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి చిన్నస్వామి, నాయకులు టి.సోమేశ్వరరావు, స్థానిక మండల అధ్యక్షుడు బి.మోహన్రావు, జి.మదన్‌రావు, పద్మ, పి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.హుకుంపేట: మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సమరెడ్డి బాలకృష్ణ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ రాష్ట్రంలో రావాలి సంక్షేమం తేవాలి. అంటూ నినాదాలు చేశారు. ముందుగా కేక్‌ కటింగ్‌ చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సమరెడ్డి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డిని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు మండల అధ్యక్షురాలు కృష్ణకుమారి, బాలనాయుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు అప్పలనరసి, జిల్లా కాంగ్రెస్‌ కోఆర్డినేటర్‌ కూడా బాలకృష్ణ, పాడేరు, జిమాడుగుల మండలాల ఇన్చార్జిలు వంతల కృష్ణ, బాబూరావు, సీసా రామారావు పాల్గొన్నారు.

➡️