10న మన్యం బంద్‌కు తరలి రావాలి

అనంతగిరిలో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి -అనంతగిరి:ఈ నెల 10న మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం, నిరుద్యోగుల ఆద్వర్యాన జరిగే ఏజెన్సీ బంద్‌ను జయప్రదం చేయాలని జడ్పిటిసి గంగరాజు పిలుపునిచ్చారు. బడ్నాయిన్న చంటిబాబు అధ్యక్షతన స్థానిక గిరిజన సంఘం కార్యాలయం వద్ద బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ, జిఒ 3 చట్టబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డీనెన్స్‌ జారీ చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6100 డిఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల్లో 1025 పోస్టులు గిరిజన సంక్షేమ శాఖకు కేటాయిస్తే రాష్ట్రం మొత్తం ఐటిడిఎ పరిధిలో 517 టీచర్‌ పోస్టులు నోటిఫై చేసిందన్నారు. ఇందులో 38 టీచర్‌ పోస్టులు మాత్రమే ఆదివాసీలకు కేటాయించారన్నారు. ఆదివాసీ ప్రాంతంలో 5 శాతం నివాసం ఉన్న గిరిజనేతరులకు 95 శాతం ఉద్యోగాలు 95 శాతం నివాసమున్న ఆదివాసీలకు 5 శాతం పోస్టులు జగన్‌ ప్రభుత్వం మంజూరు చేయడం దారుణన్నారు. ఆదివాసీ స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఆదివాసీ మాతృ భాష వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు డాక్టర్‌ రామకృష్ణ, పాంగి.రవీంద్ర, మహిళా సంఘం నాయకురాలు దీసరి దేముడమ్మ, రఘురాం, రమేష్‌ శ్రీను, భీమరాజు, గిరిజన సంఘం నాయకులు సోమేల సుబ్బారావు, గోవింద్‌ తదితరులు యువకులు పాల్గొన్నారు.హుకుంపేట: మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నేతలు కోరారు. మండల కేంద్రంలోనీ ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాపుల కృష్ణారావు మాట్లాడుతూ, ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు.100 శాతం ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ, ఆదివాసీ మహిళా సంఘం నాయకురాలు ఈశ్వరమ్మ, డిఎస్సీ సాధన కమిటీ నాయకులు నూకరాజు, నిరుద్యోగుల సంఘం నాయకులు లింగమూర్తి పాల్గొన్నారు బంద్‌పై ప్రచారంపెదబయలు:మండలంలో మారుమూల పంచాయతీ లైనకొరవంగి, రుడకోట, పర్రెడ, పంచాయతీలోని గ్రామాల్లో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యం బందుపై ఆదివాసి గిరిజన సంఘం జిల్లా పూర్వ అధ్యక్షులు బొండా సన్నిబాబు, జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మన్న పడాల్‌, మండల అధ్యక్ష కార్యదర్శులు బొండా గంగాధరం, కిలో సర్బన్నలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్‌ చేసి కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బంద్‌లో నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కార్మికులు కర్షకులు బందును జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు.బంద్‌కు మద్దతు పాడేరు : ఈ నెల 10న తలపెట్టిన రాష్ట్ర మన్యం బంద్‌కు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ వెల్లడించారు. బుధవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, డిఎస్సి నోటిఫికేషన్‌లో పోస్టులను ఆదివాసులకు ఇవ్వకుండా ఆదివా సేతరులకు ఇవ్వడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో . సిపిఐ జిల్లా నాయకులు సింహాచలం పాల్గొన్నారు.

➡️