25 నాటు తుపాకీలు స్వాధీనం

మాట్లాడుతున్న ఎఎస్‌పి

ప్రజాశక్తి-చింతపల్లి:చింతపల్లి, జికెవీధి, కొయ్యురు మండలాల్లో 25 నాటు తుపాకీలు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు చింతపల్లి అదనపు ఎస్‌పి ప్రతాప్‌ శివకిశోర్‌ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో గిరిజనులు దగ్గర ఉన్న నాటు తుపాకులు తమకు అప్ప చెప్పాలని, వారిపై ఎటువంటి కేసులు ఉండవని తెలిపారు. ఎవరైనా నాటు తుపాకితో పట్టుబడితే సుమారు రూ.10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.ఇంకా ఎవరైనా నాటు తుపాకులు కలిగి ఉంటే వెంటనే తమకు స్వాధీన పరచాలని కోరారు.

➡️