పిడుగు పడి పశువులు మృతి

మృతి చెందిన పశువులు

ప్రజాశక్తి- అనంతగిరి: మండలలోని కురుస్తున్న వర్షాలతో పిడుగు పాటుకు 11 మూగ జీవాలు మృతి చెందాయి. మండలంలోని వేంగడ పంచాయతీ డొంకపుట్టు గ్రామానికి చెందిన సివేరి కళ్యాణ్‌, సూరే. రఘరం, శివేరి సత్యారావు, శివేరి బర్కాన్న, గుండన్న, గంగన్న, లంగుపర్తి పంచాయతీ పెండిలి రామన్నలకు చెందిన పశువులు పశు గ్రాసం కోసం కొండపైన మేత కోసం వెళ్లాయి. భారీ వర్షంతో పిడుగు పడంతో 11 దుక్కెటెద్దులు మృతి చెందాయి. ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️