లోగిలిలో కాంగ్రెస్‌ ప్రచారం

Apr 7,2024 00:12
ప్రచారం చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని లోగిలి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పై ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం కింద జరిగే పనులకు రోజుకు రూ.400 కూలి చెల్లించడంతో పాటు రూ.420 కే వంట గ్యాస్‌ కనెక్షన్‌, 5 లక్షలతో ఇల్లు నిర్మాణం, ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ లక్ష చొప్పున చెల్లిస్తామని ఆ పార్టీ మండల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోతురాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వెంకటరావు, భీమారావు, దామోదర్‌, రామచందర్‌ పాల్గొన్నారు.

➡️