-అనాథ పిల్లల ఇంటికి రేకులు వితరణ

Apr 16,2024 23:58
మానవత్వం చాటుకున్న సన్యాసమ్మ

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండలానికి చెందిన అతిమరుమూల కుమడ పంచాయతీకి చెందిన సిర్లి మెట్ట గ్రామానికి చెందిన అనాధ పిల్లలైన వంతాల చిట్టిబాబు, వనిత, సంజనలను ముంచంగిపుట్టు గ్రామ నివాసి కిల్లో సన్యాసమ్మ మానవతా దృక్పథంతో తన సొంత నగదు ఎనిమిది వేల విలువగల సిమెంట్‌ రేకులను కొనుగోలు చేసి అందజేసింది.అనాధ పిల్లలకు ఆదుకోండి అనే శీర్షికతో పలు పత్రికల్లో కథనాలకు స్పందించి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. సన్యాసమ్మ తన వంతు చేతనైన సహాయం చేయాలనే సంకల్పంతో శిథిలావస్థలో ఉన్న గృహాన్ని చూసి సుమారు రూ.8000లతో గృహానికి సరిపడా సిమెంట్‌ రేకులను ఉచితంగా అందజేసింది.కప్పురేకులు అందజేసిన సన్యాసమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️