సివిల్స్‌ ర్యాంకర్‌ నరేంద్ర పడాల్‌కు సన్మానం

సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి -హుకుంపేట:మండలంలోని అండీబ గ్రామానికి చెందిన ప్రిన్సిపాల్‌ చిట్టపులి దాల్‌ పడాల్‌, విజయా భారతి దంపతుల కుమారుడు చిట్టపులి నరేంద్ర పడాల్‌ సివిల్స్‌లో 545 ర్యాంకు సాధించడంతో ఘనంగా సన్మానం చేశారు.అండిభ గ్రామం నుంచి చిట్టపులి నరేంద్ర పడాల్‌కు గిరిజన సంప్రదాయ బద్ధంగా దింసా నృత్యాలతో ఊరేగింపు చేసి ఘన స్వాగతం పలికారు. వైస్‌ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, స్థానిక సర్పంచ్‌ తామర్ల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రాజారావు, ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, శనివారం సన్మానించారు. నరేంద్ర పడాల్‌ మాట్లాడుతూ, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ పీ నాయకులు సుర్ల అప్పారావు, చీకుమద్దుల సర్పంచ్‌ సూకూరు బొంజన్న దొర, గన్నేరు పుట్టు మాజీ సర్పంచ్‌ సూడిపల్లి లక్ష్మీ ప్రమీల పాల్గొన్నారు.

➡️