పశువులకు టీకాలు

May 15,2024 23:42
టీకాలు వేస్తున్న పశు వైద్యాధికారి

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: పశువులకు జబ్బ వాపు వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని మండల పశు వైద్య అధికారి రాజా శ్రీ రైతులకు సూచించారు. కురిడి, నారింజ వలస, అరకు గ్రామాలలో బుధవారం పశు వైద్య శిబిరాలు నిర్వహించి పశువులకు ముందస్తుగా టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మూగ జీవులకు ఎటువంటి వ్యాధులు ప్రబలినా పశు వైద్య కేంద్రాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు తమ పశువులకు టీకాలను వేయించుకోవాలని ఆమె కోరారు. గ్రామాల్లో మూగజీవులకు ఎటువంటి వ్యాధులు వచ్చినా అందుబాటులో ఏహెచ్‌ఏలు ఉంటారన్నారు. వారిని సంప్రదిస్తే వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయకులు ఎస్‌ త్రినాధరావు, ఎస్‌.జయరాజు, జానకి పాల్గొన్నారు.

➡️