మన్యంలో దోమల నివారణకు చర్యలు

అవగాహన కల్పిస్తున్న డి ఎం అండ్‌హెచ్‌ఒ జమాల్‌ బాషా

ప్రజాశక్తి-పాడేరు:జాతీయ కీటక జనీత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పాడేరు మండలం గబ్బంగి పంచాయితి దాలింపుట్టు, గబ్బంగి గ్రామాలలో జిల్లా వైద్య అధికారి జమాల్‌ బాషా రెండవ విడత దోమల నివారణ కార్యక్రమాన్ని మలేరియా సిబ్బందితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి తొట్టెలు, పూలకుండిల్లో నీరు నిలవ ఉండటంతో డెంగ్యూ, మలేరియా దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్‌ఓ డి శేషయ్య, ఎస్‌యుఓ ధనుంజరు, మూర్తి, హెచ్‌ఎ శంకర్‌, ఆశ వర్కర్లు కాసులమ్మ, పూర్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.డయేరియాపై ప్రచారం పాడేరు:రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాఫ్‌ డయేరియా కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమల్‌ భాష జిల్లా పరిధిలోని చింతల వీధి ఆరోగ్య ఉప కేంద్రం, గురుకుల పాఠశాలల్లో సోమవారం ప్రచారం చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టాఫ్‌ డయేరియా అనే కార్యక్రమానికి మీ అందరూ సహకార%శీ% అందించాలని ఈరోజు నుండి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం పై అవగాహనను మా సిబ్బంది కల్పిస్తారని దాన్ని ప్రజలందరూ తప్పకుండా పాటించాలని చెప్తూ… ప్రతి ఇంట్లో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరంలోపు పిల్లలందరికీ ఆకస్మికంగా విరోచనాలు రావడం, తీవ్రమైన కడుపు నొప్పి రావడం లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉన్న ఆశా వర్కర్‌ ని సంప్రదించాలని ఆ తదుపరి ప్రాథమిక వైద్యం అందిన తర్వాత కూడా తగ్గకపోతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని, ప్రతి ఇంట్లో ఓ ఆర్‌ ఎస్‌ ప్యాకెట్టు ఉంచుకోవాలని, ఓఆర్‌ఎస్‌ తయారు చేసే విధానాన్ని అవగాహన కలిగి ఉండాలని. తల్లులకు ప్రజలకు సూచించారు. గురుకుల బాలికల పాఠశాలల్లో విద్యార్థులకు పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత హ్యాండ్‌ వాష్‌ చేసే విధానాన్ని చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో డి .ఎల్‌ ఓ డాక్టర్‌ సాధన, వైద్యాధికారి రాణా ప్రతాప్‌, ప్రిన్సిపల్‌ గణేష్‌, హెల్త్‌ సిబ్బంది శెట్టి నాగరాజు, కష్ణవేణి, సంధ్య పాల్గొన్నారు.

➡️