ఆసుపత్రిలో నీటి సౌకర్యం ఏర్పాటు

Apr 27,2024 00:40
నీటిని పట్టుకుంటున్నరోగుల బంధువులు

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నీటి సమస్యపై ఆసుపత్రి వార్డులో చేరిన రోగులు ఇచ్చిన ఫిర్యాదు, వార్తా కథనాలకు స్పందించిన డాక్టర్‌ గీతాంజలి శుక్రవారం తాత్కాలికంగా నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సామాజిక ఆరోగ్య కేంద్రంలో బోరుబావి నీరు అడుగంటి పోవడంతో గత రెండు వారాలుగా ఆసుపత్రిలో రన్నింగ్‌ వాటర్‌ సమస్య తలెత్తిందన్నారు. నూతన బోరుబావి ఏర్పాటు చేసేందుకు నివేదికలు ఉన్నతాధికారులకు పంపించామ న్నారు. అవసరాలకు వినియోగిం చేందుకు తాత్కాలికంగా తాగునీరు, రన్నింగ్‌ వాటర్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. వారం రోజుల్లో నూతన బోరుబావి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. నీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతో రోగులు, బాలింతలు, గర్భిణీలు ఉపశమనం పొందారు.

➡️