అత్యాచార నిందితుడిని శిక్షించాలి : ఐద్వా

మాట్లాడుతున్న ఐద్వా మహిళా నేతలు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల్లో ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని ఏఎస్‌పి ధీరజ్‌, సీఐ, ఎస్‌ఐలు ప్రత్యేక చొరవతో పట్టుకోవడం పై మండల గిరిజన మహిళ సంఘం (ఐద్వా) అధ్యక్షురాలు సోనియా ఈశ్వరి, కార్యదర్శి సీసా విజయలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ఈశ్వరి మాట్లాడుతూ, అత్యాచారం చేసిన దండుగుడుకి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. ఆరు సంవత్సరాల పాపను ఎత్తుకుపోయి అత్యాచారం చేడయం దుర్మార్గమన్నారు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. బాలిక తల్లిదండ్రులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐద్వా మహిళా నేతలు డిమాండ్‌ చేశారు.

➡️