రోడ్డు పనులు ప్రారంభించాలి

Apr 8,2024 23:17
నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని చీకుమద్దుల-గుమ్మడిగుంట, డల్లాపల్లి వరకు మంజూరైన తారు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, స్థానిక గిరిజనులు డిమాండ్‌ చేశారు. చీకుమద్దుల నుండి గుమ్మడిగుంట మీదుగా డల్లా పల్లి వరకు మంజూరైన ఎంజీఎన్‌ఆర్‌ఈజీ ఎస్‌ తారు రోడ్డు పనుల్లో భాగంగా మెటల్‌ రోలింగ్‌ చేశారని, అనంతరం నిలిపి వేశారన్నారు. సత్వరమే తారు రోడ్డు పనులు ప్రారంభించాలని సోమవారం నిరసన చేపట్టారు. రోడ్డు కోసం డల్లాపల్లి గ్రామంలో భూ సేకరణ చేసి ఏ ఇబ్బందులు లేకుండా అక్కడి ప్రజలను ఒప్పించామని, వారు భూములను రోడ్డుకు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు పనులు అర్దాంతరంగా ఆగిపోవడం బాధాకరం అన్నారు,ఈ రోడ్డు ఏర్పాటు తో పాడేరు,హుకుంపేట, అనంత గిరి మండలాల్లోని 15 పంచాయితీ ల ప్రజలకు రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జన్ని అప్పల స్వామి,చిరంజీవి,వంతాల బాలకష్ణ, కొర్ర నాగేశ్వరరావు సంతోష్‌, రాజారావు, సింహాచలం, వెంకట్‌, పాల్గొన్నారు.

➡️