పిల్లర్‌ దశలో నిలిచిన.. కళాశాల హాస్టల్‌ భవనం పనులు

Jun 16,2024 23:46
పిల్లర్‌ దశలో నిలిచి పోయిన భవనం

ప్రజాశక్తి -అనంతగిరి:స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల హాస్టల్‌ భవనం పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. దీంతో, విద్యార్థులు అద్దె రూముల్లో ఉంటూ చదువుకోవాల్సి వస్తుంది.అనంతగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల హాస్టల్‌ వసతి భవనం నిర్మాణానికి 2014 సంవత్సరంలో ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఆ పనులు పునాది దశ నుండి పిల్లర్స్‌ వరకు చేపట్టారు. అనంతరం గుత్తేదారులకు పేమెంట్లను అప్పటి వైసిపి ప్రభుత్వం చెల్లించక పోవడంతో పనులను నిలిపివేశారు. దీంతో, ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి. గత్యంతరం లేక విద్యార్థులు అద్దె రూములలో ఉంటూ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూములకు ఖర్చులకు ఆర్థిక స్థోమత లేక విద్యార్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నూతనం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన కళాశాల వసతి భవనం పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️