డబ్బును తిరిగి ఇప్పించాలి-

May 4,2024 00:19
ఆవేదన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

ప్రజాశక్తి- పెదబయలు : అరకువేలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్‌, ఆర్‌.ఆర్‌ రమాదేవి ఇరువురు కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారుగా 80 లక్షలు నిలుపు దోపిడీ చేసారని, వారి నుండి రికవరీ చేసి న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరారు. మండల కేంద్రంలో బాధితులు మాట్లాడుతూ, అరకు వేలి మహిళా డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్‌, ఆర్‌.ఆర్‌ రమాదేవి అగస్త్య టెక్నాలజీ కంపెనీ (హైదరాబాద్‌)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారుగా 80 లక్షలు నిరుద్యోగుల నుంచి తీసుకున్నారన్నారు. ఇప్పటికి రెండేళ్లు గడచినా ఉద్యోగాలు లేవని, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదన్నారు. ఉద్యోగాలు ఇప్పించక పోగా సెల్‌ నంబర్‌ కూడా బ్లాక్‌ చేసారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. చాలా మంది సుమారుగా ఒక్కక్కరు లక్ష ఏబది వేల వరకు మొత్తంగా 80 లక్షల వరకు ఇచ్చామన్నారు. 2023 సంవత్సరంలో ఈ విషయంపై అల్లూరి జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయగా నేటి వరకు కూడా తమకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు.

➡️