మాతృభాష వాలంటీర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి

May 27,2024 00:03
నగదును అందజేస్తున్న అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు: మృతి చెందిన ఆదివాసీ మాతృ భాష విద్యా వాలంటరీ కేశవరావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పల నరస డిమాండ్‌ చేశారు. పాడేరు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటీర్ల సమావేశంలో మృతి చెందిన పాంగీ కేశవరావు పెద్ద కర్మకు సంఘం నుండి రూ.12,500లను కేశవరావు తండ్రి, అన్నయ్య కు ఆర్ధిక సహకారం ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటరీ సంఘం నాయకులు మర్రి చిట్టి బాబు, శ్రీను, సర్భ నాయుడు, కుమారితో కలిసి అప్పల నరస అందించారు. అనంతరం అప్పల నరస మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ఆదివాసీ తెగల చిన్నారులకు మాతృ భాషను బోధిస్తున్నా అరకొర వేతనాలతో ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటీర్లు బతుకుతున్నారన్నారు. సికిల్‌ సెల్‌ వ్యాధి తో బాధపడుతున్న కేశవరావుకు కె.జి.హెచ్‌లో మెరుగైన చికిత్స అందలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సికీల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి తో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువయ్యాయన్నారు.బాధితులకు రక్త మార్పిడి, వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కెజి.హెచ్‌, పాడేరు జనరల్‌ ఆసుపత్రి లో కూడా సెకిల్‌ సెల్‌ ఎనీమియా బాధితులకు ప్రత్యేక వైద్యం సహాయం అందించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటరీ పాంగి కేశవరావు కుటుంబానికి 5లక్షల ఆర్థిక సాయం, భూమి, ఇల్లుతో పాటూ ఆ పోస్టును అతన్ని కుటుంబ సభ్యులతోనే భర్తీ చేయాలనికోరారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల భాష వాలంటీర్లు వివిధ మండలాల సంఘ నాయకులు పాల్గొన్నారు.

➡️