డోలీ మోతతో గిరిజనుల అవస్థలు

Apr 21,2024 00:03

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మారుమూల గిరిజన గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలకు ప్రసవ సమయంలో డోలి మోతలు కష్టాలు తప్పడం లేదు. మండలంలోని మారుమూల ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు కొల్లాపూట్టు పంచాయతీ బొడ్లమామిడి గ్రామానికి చెందిన పోట్టంగి సన్యాసమ్మ అనే గర్బిణి మహిళకు శనివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్‌ కు సమాచారం అందించారు. ఆ గ్రామానికి నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో సుమారు మూడు కిలోమీటర్లు దూరం మోసుకుని తీసుకెళ్లి అక్కడి నుంచి అంబులెన్స్‌ లో అరకులో ఏరియా హాస్పిటల్‌కు గర్భిణీని తరలించారు. ఇటువంటి సంఘటనలు గిరిజన ప్రాంతంలో జరుగుతున్న ప్రభుత్వం, అధికారులు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం విచారకరం. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని గ్రామాలనికి చెందిన గిరిజనులు కోరారు.

➡️