గిరిజనుల ఉపాధి ఆకు సేకరణ 

పెండింగ్ బోనస్ ఇంతవరకు చెల్లించ లేదు

ప్రజాశక్తి-విఆర్ పురం :  వేసవిలో ఇంటిల్లిపాదికి ఉపాధి వనరుగా ఉన్న తునికి ఆకు సేకరణ ప్రారంభం కోసం మన్యంలో ప్రజలు కార్మికులు ఆకు సేకరణ పనిలో ఉన్నారు మండలంలో ఆయా యూనిట్ల పరిధిలో కళ్లల్లోఆకు విక్రయాలు జరుగుతున్నాయి. అయితే గత 10 సంవత్సరాల క్రితం కోసిన ఆకుల కట్టలకు ఇప్పటికీ బోనస్ రాలేదు డబ్భులు కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. అయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న కాలంలో రావలసిన బోనస్ పెండింగ్ లో ఉన్న వాటి కోసం అనేక సందర్భాలలో సిపిఏం ప్రజా సంఘాలు ప్రజల పక్షాన పోరాడారు. ఎన్నో వినతులు అందించారు. ఇంతవరకు అయి అతీగతీ లేదు మరల కొత్తగా మూడు యేండ్ల నుండి ఇక్కడ కర్మికులు తునికి ఆకు సేకరణ చేస్తున్నారు బోనస్ డబ్భులు అధిక మొత్తం లో డబ్భులు రావాలి ఇప్పటికైనా జిల్లా అధికారులు మేలుకొని కార్మికులకు రావలసిన బోనస్ డబ్భులు చెల్లించాలని మండల ప్రజలు కార్మికులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తున్నారు.

➡️