పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ప్రజాశక్తి- సిఎస్‌ పురంరూరల్‌ : సిఎస్‌పురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997 – 2002 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మెళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆలింగమనం చేసుకుంటూ ఆనందంగా గడిపారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు. ఆట పాటలతో ఆనందంగా గడిపారు. పాఠశాల అభివద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం అప్పట్లో తమకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు జెఎస్‌. ఆనంద్‌ బాబు, సునీత దేవి, గోవిందయ్య, హరిబాబు, చంద్రమౌళి, శర్మను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️