ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

Dec 14,2023 16:52 #Kurnool

ప్రజాశక్తి- దేవనకొండ (కర్నూలు) : మండల కేంద్రమైన దేవనకొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. మండలంలోని తెర్నేకల్లు, కరివేముల, పి.కోటకొండ, గుండ్లకొండ, కే.వెంకటాపురం, కుంకనూరు, కప్పట్రాళ్ల, కేజీబీవీ ఉన్నత పాఠశాలల నుండి విద్యార్థులు రూపొందించిన సైన్స్‌ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు తిమ్మారెడ్డి, విజయనిర్మల, స్థానిక ప్రధానోపాధ్యాయుడు బజారప్ప పర్యవేక్షించారు. ఈ మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించిన 9 ఉత్తమ సైన్స్‌ ప్రాజెక్టులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️